ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మానవ అవయవాల మార్పిడి వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ (సవరణ) ఆర్డినెన్స్–2026ను గెజిట్‌లో ప్రచురించాలని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను న్యాయ శాఖ సోమవారం జారీ చేసింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 18న ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ చట్టం-1995కు ఈ సవరణ వర్తించనుంది. మానవ అవయవాల తొలగింపు, భద్రపరచడం, మార్పిడి ప్రక్రియల నియంత్రణతో పాటు అవయవాల అక్రమ వ్యాపారాన్ని నిరోధించే లక్ష్యంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ముఖ్యంగా కిడ్నీ మార్పిడుల్లో ‘స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ విధానాన్ని అమలు చేసేందుకు చట్టపరమైన మార్పులకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు గతంలో వెల్లడించింది.
Print Editionఅవయవ మార్పిడి చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 22, 2026, 11:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)