mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అదరగొట్టిన జపాన్‌.. ట్యునీషియాపై 4-0తో గెలుపు

1 గంట క్రితం

japn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 12:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హోస్టన్‌: ఆసియా ఖండ జట్లలో ఒకటైన జపాన్ రెండో లీగ్ మ్యాచ్ లో అదరగొట్టింది. నాకౌట్‌‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌‌లో ట్యునీషియాపై 4-0తో గెలిచింది. అసాయే వుడే(31, 83వ ని.) రెండు గోల్స్‌ ‌గా.. కమదా(4వ ని.), జూన్యా(69వ ని.) ఒక్కో గోల్‌‌తో మెరిసారు. మరోవైపు ట్యునీషియా జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ ఓటమితో ఆ జట్టు లీగ్‌ ‌దశలోనే నిష్ర్కమించింది. ఇక ఆదివారం జరిగిన గ్రూపు-ఎఫ్‌ మరో పోరులో నెదర్లాండ్స్‌ 5-1 తేడాతో స్వీడన్‌పై ఘన విజయం సాధించింది. జపాన్‌ తరఫున బ్రియాన్‌ బ్రాబె(5ని, 17ని), క్యాడె గప్కో(47ని, 54ని) డబుల్‌ గోల్స్‌ చేయగా.. క్రిసెన్సియో సమర్‌విల్లె(89ని) మరో గోల్ కొట్టాడు. అంథోని ఎలంగ(59ని) స్వీడన్‌కు ఏకైక గోల్‌ అందించాడు. ఈ గ్రూపులో జపాన్‌, నెదర్లాండ్స్‌ ‌జట్లు నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నా.. మెరుగైన గోల్స్‌తో నెదర్లాండ్స్‌ అగ్రస్థానంలో ‌నిలిచింది. శుక్రవారం జరిగే చివరి లీగ్‌ ‌మ్యాచ్‌‌లో ట్యునీషియాతో నెదర్లాండ్స్‌, జపాన్‌‌తో స్వీడన్‌ ‌జట్లు తలపడనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్