mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసలేహ్‌ ‌మాయ

1 గంట క్రితం

saleh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 12:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 92ఏళ్ల ఫిఫా చర్రితలో ఈజిప్ట్‌ తొలి విజయం

  • న్యూజిలాండ్‌‌పై 3-1 గోల్స్‌‌తో గెలుపు

న్యూయార్క్: ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఈజిప్ట్‌ ‌జట్టు 92 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెరదించింది. న్యూజిలాండ్‌తో సోమవారం జ‌రిగిన మ్యాచ్‌లో ఈజిప్ట్ 3-1 గోల్స్ తో విజ‌యం సాధించింది. ఆట ప్రారంభంలోనే న్యూజిలాండ్ జట్టు గోల్ చేయడంతో వెనుకబడ్డ ఈజిప్ట్ ఆ త‌ర్వాత మూడు గోల్స్ కొట్టి గెలుపొందడం విశేషం. ఈజిప్ట్ జ‌ట్టులో మొహ‌మ్మ‌ద్ స‌లేహ్ కీల‌క ప్లేయ‌ర్‌గా నిలిచాడు. ఓ గోల్ చేయ‌డంతో పాటు మ‌రో గోల్‌కు సహకరించాడు. గ్రూప్-జిలో భాగంగా ఈజిప్ట్‌-న్యూజిలాండ్‌ ‌జట్ల మధ్య మ్యాచ్‌ ‌తొలుత నువ్వా-నేనా అన్నట్లు సాగింది. దీంతో తొలి అర్ధభాగంలో న్యూజిలాండ్ ఒక గోల్‌ ‌కొట్టి 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఆ గోల్ 15వ ని.లో ఫిన్ సుర్మ‌న్ కొట్టాడు. కానీ రెండో అర్ధభాగంలో ఈజిప్ట్ ప్లేయ‌ర్లు కేవ‌లం 24 నిమిషాల వ్య‌వ‌ధిలోనే మూడు గోల్స్ చేశారు. శనివారం జరిగే గ్రూప్-జి చివరి మ్యాచ్‌‌లో ఈజిప్ట్‌ ‌జట్టు ఇరాన్‌‌తో, బెల్జియంతో న్యూజిలాండ్‌‌ పోటీపడనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్