mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'పెద్ది’లో కొత్త సన్నివేశాల జోడింపు

09 జూన్, 2026

peddi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 08:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రంలో కీలక మార్పులు చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని సన్నివేశాలను తొలగించడంతో పాటు మరికొన్ని కొత్త సన్నివేశాలను జోడించనుంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంపై జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు, అలాగే సెకండాఫ్‌లో కొన్ని పాత్రల ముగింపుల విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సినిమా నిడివి, కథనం విషయంలో వచ్చిన మిశ్రమ స్పందనను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. సెకండాఫ్‌లో కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ పోషించిన ‘గౌరినాయుడు’ పాత్రకు సంబంధించిన కొన్ని ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను తొలగించనున్నారు. రామ్ చరణ్, జగపతిబాబు మధ్య కొన్ని కీలక సన్నివేశాలను కొత్తగా జోడించనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్