mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

5 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్

1 గంట క్రితం

5 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 04:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రైల్వేకోడూరు (తిరుపతి) : ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు కోడూరు రేంజ్ ఎఫ్ఆర్ఓ ఎస్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం శ్రీనివాసులు మాట్లాడుతూ .... ముందస్తు సమాచారం మేరకు డిఎఫ్ఓ ఆదేశాతో కోడూరు అటవీశాఖ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం శేషాచల అడవులలో కూంబింగ్ నిర్వహించామన్నారు. తమిళనాడుకు చెందిన రాజా కన్ను మాయ కృష్ణ అనే హీరోని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఐదు ఎర్రచందనం దుంగలు ఒక మొబైల్ ఫోను రెండు బొడ్డులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచామని తెలిపారు. ఈ కూంబింగ్ లో గాధల ఎఫ్ఎస్ఓ ఎంవి రమణ, ఎఫ్బి ఓలు బి దేవేంద్ర రెడ్డి, కె పేరయ్య సిబ్బంది పాల్గొన్నారని ఎఫ్ ఆర్ ఓ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్