వెనిజులా : క్షణాల వ్యవధిలో సంభవించిన జంట భూకంపాలు వెనిజులాలో విషాదాన్ని మిగిల్చాయి. వందలాది భవనాలు నేలమట్టమవగా, వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ విషాదంలో ఒక కుటుంబానికి మాత్రం అద్భుతం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న కేవలం 18 రోజుల పసికందు, ఆమె తల్లి ఇద్దరూ సజీవంగా బయటపడడంతో ఆ కుటుంబంలో మళ్లీ ఆశలు చిగురించాయి. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్న సమయంలో ... ఓ ప్రాంతంలో శిథిలాల కింద పసికందు ప్రాణాలతో కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన రెస్క్యూ సిబ్బంది ఆనందంతో కేరింతలు కొట్టగా, అక్కడే ఆందోళనగా ఎదురుచూస్తున్న తండ్రి కళ్లలో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి. భార్య, బిడ్డల గురించి ఎలాంటి సమాచారం లేక తీవ్ర ఆవేదనలో ఉన్న అతను బిడ్డను మళ్లీ క్షేమంగా చేతుల్లోకి తీసుకున్న క్షణం జీవితాంతం మరచిపోలేని అనుభూతిగా నిలిచింది. శరీరంపై ఏ చిన్న గాయమూ లేకుండా, ఆకలితో పాల కోసం ఎదురుచూస్తున్న ఆ పసికందును చూసి అక్కడున్న వారందరూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే భార్య పరిస్థితి ఏమైందో తెలియక తండ్రి ఆందోళనపడ్డాడు. దాదాపు 90 నిమిషాల తర్వాత ఆమె కూడా సజీవంగా బయటపడినట్లు సమాచారం రావడంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. ప్రకృతి విపత్తు మధ్య ఆ కుటుంబం మృత్యువును జయించి బయటపడిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
శిథిలాల్లో చిగురించిన ఆశ .. మృత్యువును జయించిన 18 రోజుల పసిప్రాణం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)