విక్టోరియా : ప్రధాని మోడీ ద్వీపదేశం సీషెల్స్ మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఆ దేశ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. ప్రధానంగా చారిత్రాత్మక స్వర్ణోత్సవ జాతీయ దినోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ప్రధాని మోడీ శనివారం ఆ దేశానికి బయలుదేరారు.
కాగా, ఈ సంవత్సరం స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నందున ఇది మరింత ప్రత్యేకమైనది. ఈ ద్వీప దేశం.. విలువైన సముద్ర పొరుగు దేశంగా మోడీ ఎక్స్ పోస్టులో అభివర్ణించారు.








కామెంట్‌లు (0)