న్యూఢిల్లీ : లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపిలు పప్పు యాదవ్, అవధేష్ ప్రసాద్‌లపై వారణాసిలోని కొత్వాలి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పార్లమెంటు వెలుపల నిరసన సందర్భంగా సనాతన ధర్మాన్ని అవమానించి, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ పాటల్‌పురి మఠం అధిపతి జగద్గురు బాలక్ దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) లోని సెక్షన్లు 299, 302 కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరిలో రాహుల్‌తోపాటు బీహార్‌లోని పూర్ణియా స్వతంత్ర ఎంపి రాజేష్ రంజన్ (పప్పు యాదవ్), ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ ఎంపి (ఎస్‌పి) అవధేష్ ప్రసాద్ ఉన్నారు. శుక్రవారం పార్లమెంట్ భవనం వెలుపల రామ మందిర విరాళాల దొంగతనాన్ని ఎత్తిచూపుతూ ప్రతిపక్ష ఎంపీలు ఒక స్కిట్‌ను ప్రదర్శించిన నేపథ్యంలో పిటిషనర్ ఈ ఫిర్యాదు చేశారు.
సనాతన ధర్మాన్ని అవమానించారంటూ రాహుల్‌సహా ముగ్గురు ఎంపిలపై కేసు
01 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 09:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)