mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమలకు 25 ఈవీ బస్సులు, ‘వంతారా’ మోడల్ గోశాల:అనంత్ అంబానీ

1 గంట క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 09:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుమల : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సమావేశమైన అనంత్ అంబానీ.. తిరుమల అభివృద్ధికి పలు కీలక విరాళాలను ప్రకటించారు. టీటీడీకి సుమారు రూ.27.5 కోట్ల విలువ చేసే 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందజేస్తామని అనంత్ అంబానీ వెల్లడించారు. ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ భరిస్తుందని ప్రకటించారు. అదేవిధంగా తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా రిలయన్స్ సంస్థ సహకరించేందుకు అంగీకరించింది. గుజరాత్‌లో ‘వంతారా’ తరహాలో తిరుమల గోశాలను ఆధునీకరించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు.

తిరుమలకొండపై యాత్రికుల రద్దీ

వరుసగా మూడురోజులు సెలవులు కావడంతో.. శుక్రవారం నుంచీ తిరుమలకొండకు భక్తుల రాక పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా.. నారాయణగిరి షెడ్లు సైతం యాత్రికులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం బాటగంగమ్మ గుడివరకూ భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే వారికి సర్వదర్శనానికి 24-30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 5-7 గంటల సమయం, రూ.300 శీఘ్రదర్శనానికి 4-6 గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న (శనివారం) స్వామివారిని 85,582 మంది దర్శించుకోగా.. 44,155 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు టిటిడి తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్