ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి(చిత్తూరు) : బైరెడ్డిపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మండల వైద్యాధికారి డాక్టర్ విజయచంద్ర, డాక్టర్ శాలిని, వైద్య సిబ్బందితో కలిసి 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయచంద్ర మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు లేకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పోలియో బూత్‌లను ఏర్పాటు చేయడంతో పాటు.. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లి అర్హులైన చిన్నారులందరికీ చుక్కలు వేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.
బైరెడ్డిపల్లిలో పల్స్ పోలియో ప్రారంభం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 28, 2026, 10:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)