బుట్టాయగూడెం (ఏలూరు) : పాపికొండల సరిహద్దుల్లో పెద్ద పులి సంచారంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. నిన్న (బుధవారం) పాపికొండలు అభయారణ్యం నుంచి బయటికొచ్చిన పెద్ద పులి బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించింది. దీంతో ఏలూరు జిల్లా వాసుల్లో కలకలం రేగింది. బుధవారం తెల్లవారుజామున నిమ్మలగూడెం శివారు పాలకుంట చెరువు వద్ద పులి దాడిలో రెండు ఆవులు మృతి చెందినట్టు స్థానికుల సమాచారం. పులికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా దాని కదలికలను అటవీ సిబ్బంది పరిశీలిస్తున్నారు. సమీప అటవీ ప్రాంతాల్లో ఎవ్వరూ ఒంటరిగా తిరగవద్దని అధికారులు సూచిస్తున్నారు. మైకు ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పాపికొండల అరణ్యం నుండి బయటకు పెద్దపులి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 24, 2026, 11:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)