అనకాపల్లి : ఎపి లోని అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మడలం రేవు పోలవరం వద్ద సోమవారం మరో బోటు ప్రమాదం జరిగింది. చేపల వేటకు వెళ్లిన బోటు బోల్తా పడటంతో నలుగురు జాలర్లు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన సింహాద్రి అనే వ్యక్తి మృతదేహం బంగారంమ్మ పాలెం తీరానికి కొట్టుకొచ్చింది. మరోవైపు విశాఖపట్టణంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, మెకనైజ్డ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట మత్స్యకార కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమ వారి ఆచూకీ తెలపాలని మత్స్యకార కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నెల 1న విశాఖ ఫిషింగ్ హర్బర్ నుంచి వేటకు వెళ్లిన ఏడుగురు మత్య్సకారులు గల్లంతైన విషయం తెలిసిందే. ఒకరు ప్రాణాలతో బయటపడగా ఆరుగురి కోసం నేవీ, కోస్ట్‌గార్డ్ బృందాలు గాలిస్తున్నాయి.
అనకాపల్లిలో మరో బోటు ప్రమాదం - జాలరి మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 06, 2026, 12:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)