ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్ టిసి జెఎసి ఉద్యమానికి ఎపిఎన్ జిఒ మద్దతు

1 గంట క్రితం

apsrtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 08:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్ టిసి ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఎపిపిటిడి(ఆర్ టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఎపిఎన్ జిఒ సంఘాన్ని జెఎసి నాయకులు కోరారు. ఆదివారం విజయవాడలోని ఎపిఎన్ జిఒ సంఘ కార్యాలయంలో సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణలను జెఎసి నాయకులు కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎ విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ బస్సులను ఆర్ టిసిలో ప్రవేశపెట్టడాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తున్నాయని తెలిపారు. ఈ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్ టిసి సిబ్బందితోనే నడపాలన్నారు. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్ టిసి ప్రయివేటీకరణ ఉండదని ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని కోరారు. ఆర్ టిసి ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు జెఎసి చేపట్టే ఉద్యమాలు, భవిష్యత్ కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. సిపిఐ కార్యాలయంలోఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వలరాజు, ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మొజ్జాడ యుగంధర్‌లను జెఎసి నాయకులు కలిశారు. ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలు, 29 డిపోల్లో చేపట్టే రెండో రోజు సామూహిక నిరాహార దీక్షలు, 28న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజా రవాణా అధికారి కార్యాలయాల వద్ద జరిగే మహా ధర్నాలకు మద్దతు ప్రకటించాలని కోరారు.స్త్రీశక్తి పథకం ప్రారంభం తర్వాత బస్సులు చాలక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, బస్సుల సంఖ్య పెంచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జెఎసి ఉద్యమానికి ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్ టిసి జెఎసి కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు, కో-కన్వీనర్లు పివి రమణారెడ్డి, సిహెచ్ సుందరయ్య, ఎస్ వి శేషగిరిరావు, వై శ్రీనివాసరావు, జెఎసి నాయకులు ఎండి ప్రసాద్, ఆర్ సుబ్బారావు, ఎస్ రాజేష్ కుమార్, ఎం శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్