షాబాద్: తనపై పోక్సో కేసు పెట్టారనే పగతో రాజ్‌కుమార్ అనే ఉన్మాది రెచ్చిపోయి, కన్నబిడ్డలు, భార్యతో సహా ఏకంగా ఆరుగురిని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత మే 26న ఒక మైనర్ బాలికను వేధించిన కేసులో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్‌కుమార్(28) అరెస్ట్ చేశారు. అయితే, ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు.. తనను జైలుకు పంపారనే కక్షతో పక్కా ప్రణాళికతో ఈ ఘోరానికి ఒడిగట్టాడు. శనివారం తెల్లవారుజామున మొదట తన సొంత ఇంటికి వెళ్లి భార్య పార్వతి సరిత (30), కుమారుడు పరీక్షిత్ (3), కుమార్తె దైవిక్షిత్ (2)లను అతి క్రూరంగా చంపేశాడు. అనంతరం తనపై కేసు పెట్టిన బాధిత బాలిక ఇంటిపై దాడి చేసి, అక్కడ నిద్రిస్తున్న బాలిక నాయనమ్మ చిట్యాల రుక్కమ్మ (65), తల్లి చిట్యాల లక్ష్మి (45)లను దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా, ఆ మైనర్ బాలిక (17)ను బలవంతంగా ఊరి శివార్లలోకి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు.
అనంతరం నిందితుడు రాజ్‌కుమార్ నేరుగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తాను చేసిన ఘోరాన్ని వివరించాడు. ఆ తర్వాత తాను కూడా చనిపోతున్నానంటూ తన బంధువులకు ఫోన్లు చేసి అక్కడి నుండి పరారయ్యాడు. కొడుకు చేసిన పనికి షాక్‌కు గురైన తల్లిదండ్రులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఒకేసారి ఆరుగురు హత్యకు గురైన వార్తతో సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్‌లు భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ల సాయంతో ఆధారాలు సేకరించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు సీపీ వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున అత్యంత కిరాతకమైన సామూహిక హత్యల ఉదంతం చోటుచేసుకుంది. తనపై పోక్సో కేసు పెట్టారనే పగతో రాజ్‌కుమార్ కన్నబిడ్డలు, భార్యతో సహా ఏకంగా ఆరుగురిని దారుణంగా నరికి చంపాడు. గత మే 26న ఒక మైనర్ బాలికను వేధించిన కేసులో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. అయితే, ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు.. తనను జైలుకు పంపారనే కక్షతో పక్కా ప్రణాళికతో ఈ ఘోరానికి ఒడిగట్టాడు. రాజ్‌కుమార్ మొదట తన సొంత ఇంటికి వెళ్లి భార్య సరిత, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడిని అతి క్రూరంగా చంపేశాడు. అనంతరం తనపై కేసు పెట్టిన బాధిత బాలిక ఇంటిపై దాడి చేసి, అక్కడ నిద్రిస్తున్న బాలిక తల్లి, నాయనమ్మలను దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా, ఆ మైనర్ బాలికను బలవంతంగా ఊరి శివార్లలోకి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆపై కిరాతకంగా ప్రాణాలు తీశాడు.
ఈ దారుణ ఊచకోత అనంతరం నిందితుడు నేరుగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తాను చేసిన ఘోరాన్ని వివరించాడు. కొడుకు చేసిన పనికి షాక్‌కు గురైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఒకేసారి ఆరుగురు హత్యకు గురైన వార్తతో సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్‌లు భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ల సాయంతో ఆధారాలు సేకరించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యల అనంతరం నిందితుడు రాజ్‌కుమార్
హత్యల తర్వాత విషయం తల్లిదండ్రులకు చెప్పిన నిందితుడు..
తాను కూడా చనిపోతున్నట్టు బంధువులకు ఫోన్లు..
వెంటనే పోలీసులకు రాజ్‌కుమార్ తల్లిదండ్రుల సమాచారం..
మృతులు చిట్యాల రుక్కమ్మ (65), చిట్యాల లక్ష్మి (45), మైనర్ బాలిక (17), భార్య పార్వతి సరిత (30), కుమారుడు పరీక్షిత్ (3), కుమార్తె దైవిక్షిత్ (2)







కామెంట్‌లు (0)