ఫిఫా వరల్డ్ కప్ 2026లో స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు సంచలనం సృష్టించింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఉత్కంఠభరిత క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బలమైన బెల్జియంను 2-1 తేడాతో ఓడించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. 2010లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత స్పెయిన్ జట్టు దాదాపు 16 ఏళ్ల తరువాత సెమీఫైనల్‌కు చేరుకుంది.
ఈ మ్యాచ్లో ఆరంభం నుంచే ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. ఈ క్రమంలో ఆట 30వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు రుయిజ్ అద్భుతమైన గోల్ కొట్టి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. బెల్జియం స్టార్ ప్లేయర్ కెటెలార్ ఆట 41వ నిమిషంలో గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. దీంతో ప్రథమార్ధం ముగిసేసరికి ఇరు జట్లు సమాన బలంతో నిలిచాయి. ద్వితీయార్ధంలో సైతం విజయం కోసం ఇరు జట్లు వ్యూహప్రతివ్యూహాలతో హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకుంటున్న తరుణంలో, ఆట 88వ నిమిషంలో స్పెయిన్ ఫార్వర్డ్ మెరీనో సంచలన గోల్‌తో మెరిశాడు. ఈ గోల్‌తో స్పెయిన్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బెల్జియంను మరో గోల్ చేయనియకుండా స్పెయిన్ నిలవరించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక రాబోయే హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరులో బలమైన ఫ్రాన్స్ జట్టుతో స్పెయిన్ తలపడనుంది.
FIFA World Cup : 16 ఏళ్ల తర్వాత సెమీస్‌లోకి స్పెయిన్..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 07:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)