mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పర్యాటకం అభివృద్ధి చెందాలంటే బీచ్‌‌షాక్స్‌ అవసరం

2 గంటల క్రితం

kandula
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 10:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పిపిపి విధానంలో అభివృద్ధి

పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే బీచ్‌షాక్స్‌(బీచ్‌‌లలో మద్యం అమ్మకాలు) ‌వంటివి ఉండాలని పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. బీచ్‌‌షాక్స్‌‌లో ఆల్కహాల్‌ ‌లేని వైన్‌, బీర్‌ ‌మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో పర్యాటక రంగంలో చేపట్టిన అభివృద్ధిపై విజయవాడలోని బేరంపార్క్‌‌లో విలేకరులకు శుక్రవారం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీచ్‌‌శాక్‌‌లో ప్రవేశపెట్టిన తర్వాత ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక ఫోర్స్‌‌ను ఉపయోగిస్తామని తెలిపారు.

పిపిపి విధానంలో పర్యాటకాభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అధికారుల సమిష్టి కృషితో ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 50 వేల గదులు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ లక్ష్యం నెరవేరితే దేశంలో టాప్-5 పర్యాటక రాష్ట్రాల్లో ఏపీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, నూతన పర్యాటక పాలసీ 2024-29 విడుదల చేయడం, 117 ప్రముఖ సంస్థలతో ఎంఓయూలు కుదర్చుకొని దాదాపు రూ.20,000 కోట్ల భారీ పెట్టుబడుల ఆకర్షించామని వివరించారు. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అమలైతే 1,22,637 మందికి ప్రత్యక్ష,పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.2019-24 మధ్య పర్యాటక రంగం వెనుకబడిందన్నారు. రెండేళ్లలో దేశీయ పర్యాటకుల రాక 17 శాతం పెరిగి 37 కోట్ల ఫుట్‌ఫాల్ నమోదైందని, విదేశీ పర్యాటకుల సంఖ్య 2.62 లక్షలకు చేరిందని వెల్లడించారు. ఫలితంగా దేశంలో పర్యాటక రంగంలో16వ స్థానంలో ఉన్న రాష్ట్రం 13వ స్థానానికి చేరుకుందని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిని యాంకర్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నామని, 25 ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ల రూపకల్పన జరుగుతోందని వెల్లడించారు. 2027లో గోదావరి, 2028లో కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే నూతన ఫిల్మ్ పాలసీ ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో ప్రకటించి ప్రదానం చేయని నంది అవార్డులతో పాటు 2025 సంవత్సరం నుంచి మళ్లీ నంది అవార్డులను ప్రారంభిస్తామని చెప్పారు. నవంబర్-డిసెంబర్ నెలల్లో నంది నాటకోత్సవాలను తప్పనిసరిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఎపిటిడిసి ఇంచార్జ్ ఎండీ పద్మావతి, ఇడి శేషగిరి రావు, శిల్పారామం సిఇవో స్వామినాయుడు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్