- కార్మికులకు వెట్టి చాకిరి... కార్పొరేట్లకు లక్షల కోట్లు రుణమాఫీ
- సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగ్ రావు
ప్రజాశక్తి-తిరుపతి: దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, కనీస వేతనం 42 వేల రూపాయలు ఇవ్వాలని డిసెంబర్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు చలో ఢిల్లీ కార్యక్రమం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగ్ రావు తెలిపారు. గురువారం వేమన విజ్ఞాన కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయించుకుంటా ఉందని పేర్కొన్నారు. జీతాలు పెంచమని కోరితే దాని సంగతి పక్కన పెట్టారని, కార్పొరేట్ కంపెనీలకు ఇటీవల కాలంలో 18 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారన్నారు. ఇందులో జి గ్రూప్ సంస్థకు 22,600 కోట్లు మాఫీ చేయడానికి పూనుకుందని, అయితే దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కొంత వెనక్కు కేంద్రం తగ్గిందన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో సహజ సంపదతో పాటు, ఖనిజాలు, విమాన రంగం, సముద్ర మార్గాన్ని కూడా కార్పొరేటర్ కంపెనీలకు పట్టబడుతోంది తప్ప కార్మికులకు న్యాయం చేయడం లేదన్నారు. నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులను మరింత బానిసలుగా చేయడానికి పూనుకున్నారని పేర్కొన్నారు. ఎనిమిదో పే కమిషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి ఉపాధి హామీ పథకంలో మొత్తం కేంద్రమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లు, అంగన్వాడి కార్మికులకు పని భారం పెంచడం మానుకోవాలన్నారు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటే సిఐటి యుపోరాటంతో ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు. దేశంలో ఉన్న అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపదం చేయడం మానుకోవాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించి 42 మంది పై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. సర్ పేరుతో బిజెపి ఓట్ల చోరీ చేస్తుందని రాష్ట్రంలో 42 లక్షల మంది ఓటర్లను తొలగించడం అన్యాయం అన్నారు అందులో 16 లక్షల మంది ఓటర్లు ఇప్పటికే తీసివేశారు అని గుర్తు చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఓటు చోరీ చేసి అధికారంలో రావడానికి కుట్రలు పన్నుతానని విమర్శించారు దీన్ని ఏమాత్రం సిఐటియు చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నవంబర్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేయనున్నారని దానికి కూడా సిఐటియు మద్దతు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, సిఐటియు జిల్లా నాయకులు జి బిఎస్ మన్యం,టి సుబ్రహ్మణ్యం, జయచంద్ర
,, శివ కుమార్ పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)