ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గత మూడేళ్ల పాలనలో ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారనే భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం దౌర్జన్యాలు, రిగ్గింగ్‌కు తెగబడుతోందని తెలిపారు. మున్సిపల్, పరిషత్, పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ అధికారులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారని విమర్శించారు. నెల రోజులుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేస్తున్నా వైసిపి అభ్యర్థులకు కలెక్టర్లు, ఎస్‌పిలు రక్షణ కల్పించడం లేదని తెలిపారు. పులివెందులలో డిఎస్‌పి స్థాయి అధికారే స్వయంగా వైసిపి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ బెదిరించడం దారుణమన్నారు.







కామెంట్‌లు (0)