హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. ఈ సినిమా తాజా షెడ్యూల్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో ప్రభాస్, కథానాయిక ఇమాన్వీలపై ప్రేమగీతాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఫౌజీ’ ప్రేమగీతం చిత్రీకరణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026, 08:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)