శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోగి’. నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది సినిమా విశేషాలను పంచుకున్నారు. తన గత చిత్రాలైన ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’, ‘సీటీమార్’ తరహా భారీ కమర్షియల్ హంగులు ఇందులో ఆశించవద్దని చెప్పారు. ‘‘గత సినిమాలను దృష్టిలో పెట్టుకుని ‘భోగి’ చూడొద్దు. ఒక కొత్త దర్శకుడు తీసిన సినిమాలా భావించి, ఎలాంటి అంచనాలు లేకుండా చూడండి. ఈ సినిమా కోసం నా విజువల్ గ్రామర్, రచనా శైలిని పూర్తిగా మార్చుకున్నా. ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా సహజంగా ఉంటాయి’’ అని వివరించారు. తాను చిన్నతనంలో విన్న కొన్ని భయానక సంఘటనలు ఈ కథకు స్ఫూర్తిగా నిలిచాయని సంపత్ నంది తెలిపారు. ‘‘నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు మా ఊరిలోని ‘చీకట్ల తోట’ గురించి భయంకరమైన కథలు చెప్పేవారు. అక్కడి పేరును సినిమాలోనూ ఉపయోగించా. ‘బొగ్గులగుట్ట’ అనే గ్రామం నేపథ్యంలో నమ్మకాలు, మూఢనమ్మకాల చుట్టూ కథ సాగుతుంది’’ అని చెప్పారు. శర్వానంద్ ఈ సినిమాలో కత్తి పట్టుకుని కొత్తగా కనిపిస్తారని, నాలుగైదు యాక్షన్ సన్నివేశాలను తానే రూపొందించానని వెల్లడించారు. కథలోని భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో కథానాయిక డింపుల్ హయాతిపై చిత్రీకరించాల్సిన ఓ పాటను కూడా విరమించుకున్నట్లు తెలిపారు. సినిమా ద్వితీయార్ధంలో ప్రేక్షకులు ఊహించిన దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని దర్శకుడు చెప్పారు.
Print Editionఊరి కథలే ‘భోగి’కి స్ఫూర్తి
24 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026, 07:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)