పారాదీప్ తీరంలో కోస్ట్‌గార్డ్ ముమ్మర గాలింపు!
ఉప్పాడ: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు. నవంబర్ 19 నుంచి వారి బోటుతో సంబంధాలు తెగిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు ఈ నెల 4న రెండు బోట్లలో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. అయితే పారాదీప్ పోర్టు సమీపంలో ఉండగా వారి బోటుతో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. నవంబర్ 19 నుంచి బోటుకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేకపోవడంతో మత్స్యకారుల ఆచూకీపై ఆందోళన నెలకొంది. మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పారాదీప్ తీర ప్రాంతంలో నౌకలు, హెలికాప్టర్ల సహాయంతో విస్తృతంగా అన్వేషిస్తున్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు ఎక్కడ ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చేపల వేటకు వెళ్లిన తమవారు క్షేమంగా తిరిగి రావాలని మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో సుబ్బంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. అధికారులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసి మత్స్యకారుల ఆచూకీ కనుగొనాలని స్థానికులు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)