- సిఐటియు ఏపి కమిటీ
ప్రజాశక్తి - విజయవాడ : నీట్ పేపర్ లీక్‌పై సమరశీలంగా పోరాడి విజయం సాధించిన విద్యార్ధులకు, యువతకు సిఐటియు ఏపి కమిటీ జేజేలు పలికింది. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు సి.హెచ్.నరసింగరావు, ఏ.వి.నాగేశ్వరరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనలో ''22 మంది విద్యార్ధులను బలితీసుకుని, వారి తల్లి, దండ్రులకు క్షోభను మిగిల్చిన నీట్ పేపర్ లీక్‌పై విద్యార్ధులు చేసిన పోరాట ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం చివరి దాకా తన బల ప్రయోగంతో పోలీసులతో ఉద్యమాన్ని అణచాలని చేసిన కుటిల ప్రయత్నాలు దేశ యువత పోరాట పటిమ ముందు తలవంచక తప్పలేదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఇది రెండోవ గుణపాఠం. ఒక గుణపాఠాన్ని దేశ ప్రజానీకానికి ఆహారాన్ని అందించే రైతాంగం నేర్పింది. రెండో గుణపాఠాన్ని యువత నేర్పింది. బీజేపీ మోడీ ప్రభుత్వం తమ పద్ధతి మార్చుకోకపోతే ఇవే గుణపాఠాలు నేర్చుకోక తప్పదని పోరాటాలు తెలియజెప్పాయి. విద్యార్ధుల పోరాటాలకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలకు, మేధావులకు, సెలబ్రిటీలకు, ప్రగతిశీలమైన రాజకీయ పార్టీలను సిఐటియు ఏపి కమిటీ అభినందిస్తున్నది. భవిష్యత్తులోనూ నిజమైన దేశాభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నది.
నీట్ పేపర్ లీకేజీలకు కారణమైన ప్రైవేటీకరణ విధానాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలను రద్దు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. విద్యా రంగంలో అవకతవకలకు మÖలమైన మోడీ బీజేపీ ప్రభుత్వ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాడాలి. సామాన్య ప్రజానీకం, కార్మికులకు అనుకూలమైన విధానాలు అవలంబించేలా, లేబర్‌కోడ్స్ రద్దు, ప్రజల సొమ్ముతో ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకై కార్మికవర్గం రైతు, విద్యార్ధి రంగాల పోరాట స్ఫూర్తితో సమరశీలంగా పోరాడాలని'' పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)