టోక్యో : టీమిండియాతో జరిగే చారిత్రక టి 20 మ్యాచ్‌కు జపాన్ క్రికెట్ అసోసియేషన్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో సమతూకంగా జట్టును ఎంపిక చేసినట్లు జేసీఏ తెలిపింది. భారత్-జపాన్ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్పోర్ట్ 75’ కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 22 న జపాన్‌లోని సానో అంతర్జాతీయ మైదానంలో ఇరుజట్ల మధ్య ఏకైక టి 20 జరగనుంది. ఇరు దేశాల పురుషుల క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్, చార్లీ హరా హింజే, ఇబ్రహీం తకహషి, రియో సకురనో-థామస్, డెక్లాన్ సుజుకి తదితరులు జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. కెండెల్ గత ఏడాది కాలంలో జపాన్ తరఫున 451 పరుగులు చేయగా, ఇబ్రహీం తకహషి 248 పరుగులతో పాటు 20 వికెట్లు సాధించాడు. చార్లీ హరా హింజే 21 వికెట్లు పడగొట్టాడు.
T 20 - భారత్ తో తొలి టి 20 కి జపాన్ జట్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 10:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)