సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మామ అప్పుకు పిల్లల చదువుల పైసలు కట్ చేస్తారా?

1 గంట క్రితం

suside
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 09:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కెనరా బ్యాంకు మేనేజర్ దౌర్జన్యంపై దంపతుల ఆత్మహత్యాయత్నం

ప్రజాశక్తి -అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మందలపల్లి గ్రామానికి చెందిన దంపతులు చంద్రకళ, నాగేంద్ర ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాప్రయత్నం చేశారు. తోటి వారి గమనించి నిలువరించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితులు చంద్రకళ తెలిపిన వివరాల మేరకు.. తమ మామ తీసుకున్న పంట రుణం తీర్చాలంటూ తమ ఖాతాలను కూడా బ్యాంకు అధికారులు హోల్డ్‌ ‌చేశారని తెలిపారు. అయితే, ఇటీవల తమ ఇద్దరు చిన్నారులకు పడిన తల్లికి వందనం డబ్బులను కూడా హోల్డ్‌ ‌చేశారని, బ్యాంకు మేనేజర్‌‌కు సమస్యను విన్నవించినా పరిష్కరించకపోగా బయటకు వెళ్లండి అంటూ దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్