ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపోలీసుల ఆధీనంలో సిపిఎం కార్యాలయం

1 గంట క్రితం

cpm ofice police
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 12:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మార్కపురం : వెలిగొండ ప్రాజెక్టును సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తుండగా, మరోవైపు నిర్వాసితులకు చట్టప్రకారం పరిహారం కోసం సిపిఎం ఆందోళనకు దిగింది. ప్యాకేజీలో పేర్లు ఉండి కూడా పరిహారం అందని సుమారు వెయ్యి మంది బాధితుల తరఫున ఆందోళనలు జరుగుతుండటంతో పోలీసులు నిర్బంధకాండకు తెరలేపారు. సిఎం సభలో నిరసనలు వ్యక్తం కాకుండా సిపిఎం నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నుంచి సిపిఎం కార్యాలయంలో పోలీసులు పాగా వేసి ఈ కార్యాలయాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి డికెఎం రఫీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య, డివైఎఫ్ఐ నాయకులు ఏనుగుల సురేష్ కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు విజయ్, వందన కుమార్, సిఐటియు నాయకులు పందిటి రూబెన్ తదితరులను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. మధ్యాహ్నం సిపిఎం నేతలు భోజనానికి వెళ్లగా.. పోలీసులు మాత్రం సిపిఎం కార్యాలయంలోనే ఉండిపోయారు. సిపిఎం, ప్రజాసంఘాల నాయకులపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. సిఎం పర్యటన ముగిసే వరకూ ఈ నిర్బంధం కొనసాగే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్