ప్రజాశక్తి-కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో రెండు దశాబ్దాలుగా దీర్ఘకాల సమస్యగా 60 గ్రామాల గిరిజనులు ఎదుర్కొంటున్న పూర్ణపాడు - లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం చేపట్టిన పాదయాత్ర శనివారం మూడో రోజుకు చేరుకుంది. కురుపాం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర గుమ్మలక్ష్మిపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి నివాసం వరకు సాగింది. నాయకులు, కార్యకర్తలు కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గొడుగులు పట్టుకుని ఉత్సాహంగా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి నాగావళి నదిపై మధ్యలో నిలిచిపోయిన పూర్ణపాడు - లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేసి గిరిజన ప్రజలు రాకపోకలు సాగించేందుకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి 20 ఏళ్లు అవుతున్నా సక్రమంగా నిధులు కేటాయించకపోవడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలిచిపోయిన వంతెన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు,నాయకులు ఇందిర, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
వర్షంలోనూ వీడని పట్టు.. వంతెన పనుల కోసం సిపిఎం భారీ పాదయాత్ర
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 08:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)