బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

క్షేత్ర స్థాయి పర్యటనలకు ఉప ముఖ్యమంత్రి దూరం

20 జులై, 2026

pk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 10:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇటీవల కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ అధికారిక కార్యక్రమాలకు అందుబాటులోకి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే క్షేత్ర స్థాయి పర్యటనల సందర్భంగా జనసమూహం మధ్యకు వెళ్లిన సందర్భంలో శస్త్ర చికిత్స చేసిన భుజానికి ఏ మాత్రం అసౌకర్యం కలిగినా గాయం తిరగబెడుతుందని, అలాంటి పరిస్థితి ఏర్పడితే మరోమారు సరిచేయడం క్లిష్టతరమవుతుందని వైద్యులు స్పష్టం చేశారని ఉపముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిచింది. కనీసం మరో రెండు వారాల పాటు క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది. దీంతో అధికారిక కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఉపముఖ్యమంత్రి సిబ్బందిని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్