ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ రామకృష్ణ

37 నిమిషాల క్రితం

cpi rama krishna.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 11:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం మార్కెట్ యార్డును సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా పశువుల సంతలో రైతులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పశుగ్రాసం కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు, చేసేదేమీ లేక తమ పశువులను అమ్ముకుంటున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితుల్లో రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కరవును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో సీఎంను కలుస్తామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్