ప్రజాశక్తి–రాజంపేట: మార్షల్ ఆర్ట్స్‌ను నిరంతరం సాధన చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ కొండూరు శరత్ కుమార్ రాజు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ పొన్నెబోయిన సుధాకర్ అన్నారు. ఈ నెల విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓపెన్ టైక్వాండో పోటీల్లో అన్నమయ్య టైక్వాండో అకాడమీ క్రీడాకారులు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచినట్లు గ్రాండ్ మాస్టర్ సగినాల పిచ్చయ్య తెలిపారు. ఎం. శ్రీరామరాజు, సగినాల రిజ్వాన్‌లు ఫస్ట్ డాన్ నుంచి సెకండ్ డాన్‌కు అర్హత సాధించారు. అలాగే సగినాల ఉమ్మి కుల్సమ్, ఎం. సాహితి, ఎం. గౌతమ్ నందన్ కిషోర్, ఎస్. ఉమర్, జి. దీపేష్, కే. రితేష్‌లు బ్లాక్ బెల్ట్ సాధించారు. మరో తొమ్మిది మంది క్రీడాకారులు వివిధ కలర్ బెల్ట్‌లలో ఉత్తీర్ణత సాధించినట్లు పిచ్చయ్య వెల్లడించారు. బెల్ట్ గ్రేడ్లు సాధించిన క్రీడాకారులను ఆదివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అభినందించి బెల్టులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండూరు శరత్ కుమార్ రాజు, బ్యాంక్ మేనేజర్ సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను, క్రీడలను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉన్నత విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల పట్ల ఆసక్తి చూపేలా ప్రోత్సహించాలని సూచించారు.
మార్షల్ ఆర్ట్స్‌తో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం
23 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)