ప్రజాశక్తి–బ్రహ్మంగారి మఠం(కడప) : బ్రహ్మంగారి మఠం మండలంలోని నరసన్నపల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాలకు గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారుమడులకు సకాలంలో నీరు అందించేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి పోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు సమీపంలోనే బ్రహ్మసాగర్ జలాశయం ఉన్నప్పటికీ, పిల్లకాలువల ద్వారా సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పిల్లకాలువల వ్యవస్థను మెరుగుపరచి సాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. మరోవైపు, విద్యుత్ అంతరాయంపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని రైతులు తెలిపారు. వరి సాగులో నారుమడులకు నిర్ణీత సమయంలో నీరు అందకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఆ ఇబ్బందులను రైతులే అర్థం చేసుకోగలరని వారు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో విద్యుత్ శాఖ అధికారులు రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు విద్యుత్ కష్టాలు.. ట్యాంకర్లతో నారుమడికి నీరు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 06, 2026, 10:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)