ప్రజాశక్తి-చంద్రగిరి: నారాయణ బాలికల జూనియర్ కళాశాలలో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1,500 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. సురేష్ కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఈ. అరుణాచలం, పోలీసు సిబ్బంది పాల్గొని మహిళల భద్రత, విద్య ప్రాధాన్యత, కెరీర్ మార్గదర్శకత్వం, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల నివారణ, బాల్య వివాహాల నిషేధ చట్టంపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాల్సిన అవసరం, శక్తి యాప్ వినియోగం, దాని ప్రయోజనాలను విద్యార్థినులకు వివరించారు. అలాగే లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం కృషి చేయాలని, ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసు శాఖను సంప్రదించాలని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని అధికారులు విద్యార్థినులకు సూచించారు.
నారాయణలో మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 06, 2026, 10:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)