ప్రజాశక్తి-చంద్రగిరి(తిరుమల) : చంద్రగిరి మండలం నరసింగపురం వద్ద తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నారాయణ పాఠశాల సమీపంలోని రహదారి దెబ్బతినడంతో ప్రతిరోజూ విద్యార్థులు, ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రంగంపేట నుంచి చెర్లోపల్లి వరకు రహదారి గుంతలమయంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగినా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. రోడ్డు భవనాల శాఖ అధికారులు వెంటనే ప్యాచ్‌వర్క్ చేపట్టి రహదారిని మరమ్మతు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు, విద్యార్థులు, వాహనదారులు కోరుతున్నారు.
గుంతలమయమైన రోడ్డు.. వాహనదారుల అవస్థలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 06, 2026, 10:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)