mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వేట నిషేధం ముగిసిన తొలిసారే .. జాలర్ల పంట పండింది..!

1 రోజు క్రితం

Fishermen hit the jackpot the very first time after the fishing ban ended!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 12:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సఖినేటిపల్లి : రెండు నెలల వేట నిషేధం ముగిసిన తరువాత ... సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన మత్స్యకారుల వలలో అరుదైన కచిడి చేపలు పడ్డాయి. ఇంకేముంది ... ఓ వ్యాపారి వెంటనే వాటిని రూ.1.50 లక్షలకు కొనేశాడు..! సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్ల వలకు ఒకేసారి మూడు అరుదైన కచిడి చేపలు చిక్కాయి. ఈ ఘటన హార్బర్ పరిసరాల్లో ఆసక్తిని రేకెత్తించగా, మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరిసింది. సముద్రం నుంచి తీసుకొచ్చిన ఈ మూడు చేపలను హార్బర్‌లో బహిరంగ వేలం నిర్వహించగా, స్థానిక వ్యాపారి వాటిని మొత్తం రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశాడు. చేపలు అరుదుగా దొరకడం, వాటికి మార్కెట్‌లో ఉన్న డిమాండ్ కారణంగా వేలంలో మంచి ధర పలికింది. స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం ... వలలో పడిన చేపల్లో 12 నుంచి 13 కిలోల బరువున్న రెండు మగ చేపలు, ఒక ఆడ చేప ఉన్నాయి. కచిడి చేపల పొట్ట భాగంలో లభించే ప్రత్యేక పదార్థాన్ని కొన్ని ఔషధాల తయారీలో వాడతారని, అందువల్ల ఈ చేపలకు మార్కెట్‌లో అధిక ధర ఉంటుందని వారు తెలిపారు. ఇంకా పెద్ద పరిమాణంలో ఉండే కచిడి చేపలు వలకు చిక్కితే ఒక్కో చేపకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర లభించే అవకాశం ఉంటుందని స్థానిక మత్స్యకారులు వివరించారు. అందుకే ఈ చేపలు దొరికితే మత్స్యకారులకు భారీ ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఇక అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆ చేపలను ఆసక్తిగా వీక్షించారు. రెండు నెలల వేట విరామం అనంతరం తొలి రోజుల్లోనే ఇలాంటి అరుదైన చేపలు లభించడం శుభసూచకంగా భావిస్తున్న మత్స్యకారులు, ఈ సీజన్‌లో మరింత మంచి వేట దొరుకుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్