శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జూరాలకు పోటెత్తుతున్న వరద.. 30 గేట్లు ఎత్తి నీటి విడుదల

1 గంట క్రితం

jurala\.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 10:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 30 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 2.26 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 2.36 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. జూరాల నుంచి భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ కాలువలకు కూడా నీటి విడుదల కొనసాగుతోంది. మరోవైపు ప్రాజెక్టులోని 9 యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్