- ఎపిఎస్ ఆర్ టిసి ఎండి ఎన్ బాలసుబ్రమణ్యం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్ ఆర్ టిసి యాజమాన్యం, ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) మధ్య జరిగిన వరుస చర్చలు సత్ఫలితాలిచ్చాయని ఎపిఎస్ ఆర్ టిసి ఎండి ఎన్ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. శుక్రవారం విజయవాడ సంస్ధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన 40 ప్రధాన సమస్యల్లో 35 సమస్యలకు పరస్పర చర్చల ద్వారా పరిష్కారం లభించాయన్నారు. మరో ఐదు అంశాలను ప్రభుత్వ పరిశీలనకు పంపాలని నిర్ణయించినట్లు చెప్పారు. 76 మంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు ఆమోదం లభించిందనాన్నారు. ప్రతి నెల సుమారు 27 లక్షల మంది స్ట్రీ శక్తి పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారన్నారు.ఎపి ఇబస్సు సేవా కింద అదనపు బస్సులు మొత్తంగా 6,7 నెలల్లో సుమారు 1,550 కొత్త బస్సులు ఆర్‌టిసిలోలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఉద్యోగాలకు నష్టం లేదన్నారు. ఎపి ఇబస్సు సేవా కింద తొలి దశలో 750, రెండో దశలో 300, మొత్తం 1,050 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే అవకాశం ఉందన్నారు. డ్రైవర్లు, మెకానికల్ సిబ్బందికి ఉద్యోగ నష్టం ఉండదని హామీ ఇచ్చారు.గతంలో మూసివేసిన నాలుగు డిపోలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.ఈ సమావేశంలో నూతన జెఎండి శివ ప్రసాద్ పాల్గొన్నారు.
నిరసన దీక్షలు తాత్కాలికంగా వాయిదా
ఆర్ టిసి ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు జెఎసి కన్వీనర్లు వై శ్రీనివాసరావు, పి దామోదరరావు తెలిపారు. పలు సార్లుగా ఎండి, ఇడిలతో జెఎసి నాయకత్వంతో జరిగిన చర్చలలో సంస్థ పరిధిలోని అంశాలు అన్నిటిని అంగీకరిస్తూ వ్రా తపూర్వకంగా మినిట్స్ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జెఎసి 17,18 తేదీల్లో అన్ని డిపోలు వద్ద తలపెట్టిన నిరాహార దీక్షలు, ఈనెల 28న డిపిటిఒ కార్యాలయాల దగ్గర తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.







కామెంట్‌లు (0)