ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పులుల ఆవాసాలలో ఒకటైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణకు మార్గదర్శకాలను రూపొందించేందుకు హైపవ కమిటీని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ టైగర్ రిజర్వ్ పరిధిలో రెండు రోజుల క్రితం ఆడ పులి అనుమానాస్పద మృతి ఘటన నేపధ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కమిటీని ప్రతిపాదించారు. పులులతోపాటు వన్యప్రాణుల సంరక్షణ చర్యలు, హనుమాన్ కార్యకలాపాలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేపట్టేందుకు వీలుగా ఈ హైపవర్డ్ కమిటీకి సిఫారసు చేశారు.ఈ కమిటీలో అటవీశాఖ సలహాదారు పి. మల్లికార్జునరావు, అడిషనల్ పిసిసిఎఫ్ రాహుల్ పాండే శాఖపరమైన సభ్యులుగా ఉంటారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సభ్యులు బి రాజశేఖర్, హైదరాబాద్ కన్జర్వేషన్ ఫర్ టైగర్ సొసైటీ ప్రతినిధి ఇమ్రాన్ సిద్ధిఖీ, ప్రముఖ వన్యప్రాణి శాస్త్రవేత్త డాక్టర్ ఎం. నవీన్ కుమార్ సభ్యులుగా సేవలందిస్తారు. ఈ కమిటీకి క్షేత్రస్థాయిలో సహకారం అందించడంతో పాటు సమన్వయ బాధ్యతలను విధుల్లో ఉన్న సీసీఎఫ్ అధికారి నిర్వహించనున్నారు.పులుల జనాభా, ఆవాసాలకు ఎదురవుతున్న ముప్పులను గుర్తిస్తూ సమగ్ర అంచనా నివేదిక రూపొందించడం, నివారణకు తగిన వ్యూహాలకు రూపకల్పన చేయాలని హైపవర్డ్ కమిటీ సభ్యులకు పవన్ కళ్యాణ్ దిశగా నిర్దేశం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, సంస్థాగత సంస్కరణలు, సిబ్బంది సామర్థ్యాల పెంపు, మౌలిక సదుపాయాల బలోపేతం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర అంశాలపై సమగ్రమైన సిఫారసులు రూపొందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులు, ఇతర భాగస్వామ్య వర్గాలతో సమావేశాలు నిర్వహించి, శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను పరిశీలించి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని తెలిపారు. కమిటీ సిఫారసులు నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో తీసుకుంటున్న సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
పులుల సంరక్షణ, నిర్వహణ చర్యలపై హైపవర్ కమిటీ
02 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 11:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)