ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‌కొత్తిమీరను ఇలా నిల్వ చేసుకోవాలి

8 గంటల క్రితం

kottimeera
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 01:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వంటల్లో తరచూ ఉపయోగించే కొత్తిమీరను సరిగ్గా నిల్వ చేయకపోతే రెండు, మూడు రోజుల్లోనే వాడిపోవడం, పసుపు రంగులోకి మారడం, కుళ్లిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఫ్రిజ్‌లో ఉన్న కొత్తిమీరను వారాల పాటు తాజాగా ఉంచుకోవచ్చు.

​. మార్కెట్‌ నుంచి తీసుకొచ్చిన కొత్తిమీర కట్టను విప్పి, పసుపు రంగులోకి మారిన, ఎండిపోయిన లేదా కుళ్లిన ఆకులను తొలగించాలి. అవసరమైతే పొడవుగా ఉన్న వేర్లను కొద్దిగా కత్తిరించాలి. స్టోర్‌ చేసే ముందు కొత్తిమీరను కడగకూడదు. తేమ ఉంటే అది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొత్తిమీర తడిగా ఉంటే, కాటన్‌ గుడ్డ లేదా పేపర్‌ టవల్‌పై కొద్దిసేపు ఆరబెట్టాలి.

. ఆ తర్వాత పూర్తిగా పొడిగా ఉన్న ఎయిర్‌టైట్‌ ప్లాస్టిక్‌ లేదా గాజు డబ్బా తీసుకుని అడుగున డ్రై టిష్యూ పేపర్‌ పరచాలి. దానిపై కొత్తిమీరను క్రమంగా అమర్చి, మళ్లీ పైభాగంలో మరో టిష్యూ పేపర్‌ ఉంచి డబ్బాను బిగుతుగా మూసి ఫ్రిజ్‌లోని వెజిటబుల్‌ క్రిస్పర్‌లో పెట్టాలి. ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి టిష్యూ పేపర్‌ తడిగా మారిందో లేదో చూసి, అవసరమైతే కొత్తది మార్చాలి.

. డబ్బా ఉపయోగించకూడదనుకుంటే కొత్తిమీరను శుభ్రమైన కాటన్‌ గుడ్డ లేదా న్యూస్‌పేపర్‌లో సున్నితంగా చుట్టి, జిప్‌లాక్‌ బ్యాగ్‌ లేదా ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు.

. కొత్తిమీరను కడిగి వేర్లు తొలగించిన తర్వాత, కాడల భాగాన్ని నీరు ఉన్న గ్లాసులో ఉంచి ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. ఈ విధానంలో కూడా కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్