అమరావతి : ఎపి, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పై తన ప్రభావం చూపుతోంది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన తాజా సమాచారం మేరకు ... ఆగస్టు 3 వ తేదీ వరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం బాగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది గంటకు సుమారు 3 కిలోమీటర్ల నెమ్మదిగా ఉండే వేగంతో ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న హల్దియా, బాలాసోర్ మధ్య కేంద్రీకృతమై ఉంది. కొద్ది గంటల్లో హల్దియా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా కోస్తా ప్రాంతాల్లోని ఓడరేవుల్లో మూడో నంబరు, ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేశారు.
వాయుగుండం ఎఫెక్ట్ - తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 28, 2026, 10:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)