తెలంగాణ : సినీ నటి పావలా శ్యామల (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందినట్టు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో ఆమె బాధపడ్డారు. గతంలో పవన్ కల్యాణ్, సాయి దుర్గాతేజ్, దిల్‌రాజు సహా మరికొందరు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం చేశారు. 1951లో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి (గుంటూరు జిల్లా) లో జన్మించిన పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆమె.. పదో తరగతి వరకు చదువుకున్నారు. నాటక రంగంతో నటనలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1985లో ‘బాబాయ్ అబ్బాయ్’తో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్యామల.. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణకమలం’ సినిమాతో గుర్తింపు పొందారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’లో సహాయ నటి పాత్రలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆంధ్రావాలా’ లో ‘పావలా’ అనే పేరుతో చేసిన క్యారెక్టర్ పాపులర్ అవ్వడంతో, ఆమెకు పావలా శ్యామలగా పేరు వచ్చింది. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. కాగా, పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో జీవన పోరాటం సాగించారు. ఆమెతోపాటు ఉంటున్న కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండటంతో ఆ కుటుంబం దీనస్థితిలో ఉంది. ఒకప్పుడు వెండితెరపై విశేషంగా ఆకట్టుకున్న హాస్య నటి, చివరి రోజుల్లో ఇన్ని కష్టాలు అనుభవించి కన్నుమూయడం పట్ల టాలీవుడ్ చిత్ర పరిశ్రమ, ప్రముఖులు మరియు సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
సినీ నటి పావలా శ్యామల కన్నుమూత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 28, 2026, 09:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)