ప్రజాశక్తి-తిరుమల : తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం మరోసారి భక్తులను భయాందోళనకు గురిచేసింది. తాజాగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించడంతో య్రాతికులు భయంతో పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. శబ్దాలు చేస్తూ చిరుతను నెమ్మదిగా అడవి ప్రాంతం వైపు తరిమారు. అలిపిరి నడక మార్గంలో ప్రయాణించే యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఒంటరిగా కాకుండా గుంపులుగా మాత్రమే నడవాలని, రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తప్పనిసరిగా శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని సూచనలు చేశారు.
అలిపిరి నడక మార్గంలో చిరుత కలకలం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 09:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)