ప్రజాశక్తి-మైదుకూరు: వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం శివపురం గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేసీ కాలువలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ వలస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గోపి (30) అనే వ్యక్తి మైదుకూరు పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున అతడు ట్రాక్టర్‌పై వెళ్తుండగా, శివపురం ఎస్సీ కాలనీలోని గంగమ్మ గుడి సమీపానికి రాగానే ట్రాక్టర్ నియంత్రణ కోల్పోయి నేరుగా పక్కనే ఉన్న కేసీ కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోపి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మైదుకూరు ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
కేసీ కెనాల్‌లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. జార్ఖండ్ కార్మికుడు దుర్మరణం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 09:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)