సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్పొరేట్లపై ఉన్న ప్రేమ వెలిగొండ నిర్వాసితులపై ఏదీ?

4 రోజుల క్రితం

lokanatam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 09:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకనాథం

​ప్రజాశక్తి-మార్కాపురం : టిడిపి కూటమి ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల మీద చూపిన ప్రేమ... సర్వం కోల్పోయిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల చూపడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకనాథం విమర్శించారు. నిర్వాసితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని గాలికి వదిలేసి... కార్పొరేట్ శక్తులకు రూ. లక్షల కోట్ల ఖరీదు చేసే భూములను, రాయితీల పేరుతో నిధులను దోచుపెడుతోందని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు పరిధిలోని సుంకేసుల, గొట్టిపడియ గ్రామాలను లోకనాథంతో పాటు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే శివనాగరాణి, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు పూసపాటి వెంకట్రావు, ఎపి రైతు సంఘం సీనియర్ నాయకులు గాలి వెంకటరామిరెడ్డి తదితరులు బుధవారం పర్యటించారు. నిర్వాసితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోకనాథం మాట్లాడారు. వెలిగొండ నిర్వాసితుల పట్ల ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు కూడా చర్చించకపోవడం దారుణమన్నారు. విపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. ముంపు గ్రామాల్లోని ప్రజలను బలవంతంగా ఖాళీ చేయిస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్