mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నారా కుటుంబంలో సరికొత్త ఆనందం - తండ్రైన నారా రోహిత్

2 గంటల క్రితం

New joy in the Nara family – Nara Rohit becomes a father.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 11:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు నారా రోహిత్ కుటుంబంలో సరికొత్త ఆనందం నెలకొంది. నారా రోహిత్, ఆయన భార్య శిరీష దంపతులకు మగబిడ్డ జన్మించినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఈ శుభవార్తతో నారా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సినీ ప్రముఖులు దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో నారా రోహిత్‌కు అభినందనలు తెలుపుతున్నారు.


నారా రోహిత్, శిరీషల నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ వేడుక అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నారా కుటుంబానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక టాలీవుడ్‌లో విభిన్న కథలను ఎంపిక చేసుకునే నటుడిగా నారా రోహిత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కంటెంట్ ప్రధానమైన కథలను ఎంచుకుంటూ ఆయన తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన ‘సుందరకాండ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన, మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.ప్రస్తుతం నారా రోహిత్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో సోలో హీరోగా మరో చిత్రంలో కూడా నటిస్తున్న ఆయన, కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్