- కడప జిల్లాలోనే అత్యధికం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్నప్పటికీ పి-4 (పబ్లిక్ -ప్రైవేట్ -పీపుల్ -పార్టనర్ షిప్)కు క్షేత్రస్థాయిలో ఆశించినంత స్పందన రావడం లేదు. ప్రణాళిక శాఖ రూపొందించిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో 61స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఈ పథకం అసలు అమలుకు నోచుకోలేదు. ఈ పథకానికి సంబంధించి సేవల అనుసంధానంలో జిల్లాల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నట్టు ప్రణాళిక శాఖ గుర్తించింది. గ్రామీణ స్థాయి సచివాలయాల బంగారు కుటుంబాలతో అనుసంధానించిన శాతం రాష్ట్రవ్యాప్తంగా 92.05 శాతంగా ఉండగా, మార్గదర్శులతో అనుసంధానం మాత్రం 40.72 శాతం వద్ద ఉంది. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61 సచివాలయాలు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లు జిల్లాల వారీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బంగారు కుటుంబాలతో సచివాలయాలు అనుసంధా నంలో పల్నాడు జిల్లా 98.61 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత పార్వతీపురం మన్యం 98.70 శాతం, విశాఖపట్నం 98.37 శాతం, గుంటూరు 98.32 శాతం, అనకాపల్లి 97.75 శాతం, ఎన్టీఆర్ జిల్లా 97.69 శాతం, తిరుపతి 97.36 శాతం, నెల్లూరు 96.72 శాతం, శ్రీకాకుళం 96.43 శాతంతో మెరుగ్గా ఉన్నాయి. అయితే వైఎస్సార్ కడప జిల్లా 72.22 శాతంతో చివరి స్థానంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సత్యసాయి జిల్లాలో 76.26 శాతం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమలో 79.04 శాతం, ఏఎస్ఆర్ జిల్లాలో 80.44 శాతం, అనంతపురంలో 82.78 శాతం ఉన్నాయి. మార్గదర్శితో అనుసంధానంలో నంద్యాల ముందంజ సచివాల యాలు మార్గదర్శితో అనుసంధానించిన విషయంలో నంద్యాల జిల్లా 93.39 శాతంతో మొదటి స్థానంలో ఉంది. అనకాపల్లి 88.67 శాతం, పోలవరం 87.06 శాతం, శ్రీకాకుళం 76.24 శాతం, బాపట్ల 74.70 శాతం, విజయనగరం 67.64 శాతం, ఎన్టీఆర్ జిల్లా 67.14 శాతం, ఏఎస్ఆర్ జిల్లా 63.09 శాతం ఉన్నాయి. ఈ విషయంలో విశాఖపట్నంలో 11.43 శాతంతో అత్యల్ప స్థాయిలో ఉండగా, అనంతపురంలో 19.98 శాతం, గుంటూరులో 17.40 శాతం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 17.58 శాతం, వైఎస్సార్ కడపలో 17.71 శాతం, మార్కాపురంలో 17.92 శాతం, అన్నమయ్యలో 15.17 శాతం నమోదయ్యాయి.ఈ పథకం అమలులో వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 32 సచివాలయాలు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాయి. బిఆర్ ఆంబేద్కర్ కోనసీమలో 12, శ్రీ సత్యసాయి జిల్లాలో 6, అనంతపురంలో 4, అన్నమయ్యలో2, చిత్తూరులో 2, మార్కాపురంలో 1, విశాఖపట్నం లో 1, పశ్చిమగోదీవరిలో ఒక సచివాలయం పరిధిలో పి4 అమలుకావడం లేదు.








కామెంట్‌లు (0)