గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమలలో పోటెత్తిన యాత్రికులు.. సర్వదర్శనానికి 24 గంటలు

1 గంట క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 07:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో యాత్రికులు వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని యాత్రికులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,670 మంది యాత్రికులు దర్శించుకున్నారు. 33,904 మంది యాత్రికులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.95 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్