భూత్పూర్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి సహా 200లకు పైగా మేకలు సజీవ దహనమయ్యాయి. జాతీయ రహదారిపై కర్నూలు మార్గంలో మేకల లోడుతో వెళ్తున్న డీసీఎం.. రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డును ఢీకొంది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి క్షణాల్లో కాలిపోయింది. వ్యాన్‌లో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో 200లకు పైగా మేకలు సజీవ దహనమయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎస్పి జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
డిసిఎంలో మంటలు.. వ్యక్తి సహా 200లకు పైగా మేకలు సజీవ దహనం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 08:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)