గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం

1 గంట క్రితం

lorry and bus .jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 09:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–వల్లూరు(కడప) : వల్లూరు మండలంలోని పాపాగ్ని నది కట్ట గ్రామం వద్ద కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై గురువారం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. కొత్తగా నిర్మించిన వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో బస్సు ఒక్కసారిగా కుదుపునకు గురికావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులెవరూ గాయపడలేదు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్