శనివారం, 28 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీలో పలు జిల్లాలకు వర్షసూచన

47 నిమిషాల క్రితం

During the rainy season IT employees should head home by 4 PM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 07:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. రాయలసీమలోని మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్