బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్టీసి హయ్యర్ పెన్షన్, పిఎఫ్ సమస్యలను పరిష్కరించాలి

07 ఆగస్టు, 2026

rtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 09:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆర్టీసి జెఎసి నాయకులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (ఆర్టీసి) ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ తదితర సమస్యలను పరిష్కరించాలని జెఎసి కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు కోరారు. శుక్రవారం హైదరాబాద్ బర్కత్‌పూర్‌లోని ఇపిఎఫ్ ప్రాంతీయ కమిషనర్‌ వన్ పి శ్రీకాంత్ కు వినతిపత్రం అందించారు. ఎపిఎస్ఆర్ టిసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికార్లు ఆధ్వర్యంలో ఆర్ టిసి ఉద్యోగసంఘాల జెఎసి నాయకులు ప్రాంతీయ కమిషనర్ ను కలిశారు. ఈ సందర్భంగా జెఎసి కన్వీనర్లు మాట్లాడుతూ పిఎఫ్, ఇపిఎస్, పెండింగ్ పెన్షన్ క్లెయిమ్స్, పిఎఫ్ ఖాతాల బదిలీలు, సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హయ్యర్ పెన్షన్ కు దరఖాస్తు చేసుకున్న సుమారు 6,000 మందిని రిజెక్టు చేసిన ఉద్యోగుల జాయింట్ ఆప్షన్ దరఖాస్తులను అనుమతించాలని కోరారు. అందరికీ వన్ టైమ్ ప్రామాణికంగా మరో అవకాశం కల్పించి వడ్డీతో సహా మొత్తాలు చెల్లించుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. 2013, 2017 ఏళ్లలో పిఆర్ సి వేతన సవరణలతో పెరిగిన వేతనాలు, డిఎను పరిగణనలోకి తీసుకొని హయ్యర్ పెన్షన్‌ను లెక్కించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. 2014 వరకు ఉద్యోగుల నుంచి హయ్యర్ పెన్షన్ పేరిట రికవరీ చేసిన కాంట్రిబ్యూషన్ మొత్తాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలన్నారు. రాష్ట్రవిభజన చట్టంలోని అంశాలకు భిన్నంగా ఎపిఎస్ ఆర్ టిసి పిఎఫ్ కోడ్ ను ఏకపక్షంగా టిఎస్ఆర్టిసి కి కేటాయించడంతో ఉద్యోగులు అనేక రకాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎపిఎస్ఆర్ టిసికి సంబంధించిన పిఎఫ్ కోడ్ ను ఎపిఎస్ఆర్ టిసికే కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు కె.ఎస్. బ్రహ్మానందరెడ్డి, యన్ సుదాకరరావు, ఎల్ డిఎస్ విజయలక్ష్మి, కె.వి.లక్ష్మినారాయణ ఆర్ టిసి కో-కన్వీనర్లు పివి రమణారెడ్డి, జివి నరసయ్య, వై.శ్రీనివాసరావు, సభ్యులు ఎస్ కె జిలానీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్