- ఎపిఎస్ఆర్ టిసి చైర్మన్ కొనకళ్ల నారాయణరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్ టిసి) 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఆర్ టిసి హౌస్‌లో శనివారం ఘనంగా జరిగాయి. ఎపిఎస్ఆర్ టిసి రాష్ట్ర చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ మహాత్మాగాంధీ నాయకత్వంలో సాగిన అహింసా ఉద్యమం ద్వారా భారత్ లోపెద్ద ఎత్తున రక్తపాతం లేకుండా స్వాతంత్య్రం సాధించిందన్నారు. అనంతరం రాజ్యాంగాన్ని స్వీకరించి ప్రపంచంలోనే ప్రముఖ దేశంగా భారత్ ఎదిగిందని తెలిపారు.1958లో ఏర్పడిన ఎపిఎస్ ఆర్ టిసి ప్రస్తుతం 129 డిపోలు, సుమారు 42 వేల మంది ఉద్యోగులు, 10,500కు పైగా బస్సులతో ప్రజలకు నిరంతర రవాణా సేవలు అందిస్తోందని తెలిపారు. రోడ్డు భద్రత, ఇంధన పొదుపు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర రంగాల్లో సంస్థకు అవార్డులు, గుర్తింపు లభించడానికి ఉద్యోగుల అంకితభావమే కారణమన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలులో ఆర్ టిసి ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఉద్యోగం, ఉపాధి, విద్య, వైద్యం, ఆలయాలు, తీర్థయాత్రలు, బంధువుల ఇళ్లకు వెళ్లడం వంటి అవసరాలకు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం లభించిందన్నారు.విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 60 మంది ఉద్యోగులు, సూపర్‌వైజర్లు, అధికారులు ఈ సందర్భంగా సత్కారం అందుకున్నారు. వారికి నగదు పురస్కారాలతో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, ఎండి ఎన్ బాలసుబ్రహ్మణ్యం, జాయింట్ ఎండి ఎంశివకుమార్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)